Get Mystery Box with random crypto!

🔱 🕉️🙏🚩 *శివ భక్తులు - నాయనార్ల జీవిత చరిత్రలు - పెరియ పురాణం* 🔱 🕉️🙏🚩

டெலிகிராம் சேனலின் சின்னம் periyapuranam — 🔱 🕉️🙏🚩 *శివ భక్తులు - నాయనార్ల జీవిత చరిత్రలు - పెరియ పురాణం* 🔱 🕉️🙏🚩
டெலிகிராம் சேனலின் சின்னம் periyapuranam — 🔱 🕉️🙏🚩 *శివ భక్తులు - నాయనార్ల జీవిత చరిత్రలు - పెరియ పురాణం* 🔱 🕉️🙏🚩
சேனல் முகவரி: @periyapuranam
வகைகள்: மதம்
மொழி: தமிழ்
நாடு: இந்தியா
சந்தாதாரர்கள்: 226
சேனலில் இருந்து விளக்கம்

🕉️🔱🙏🚩 *శివ భక్తులు - నాయనార్ల జీవిత చరిత్రలు - పెరియ పురాణం* 🔱 🕉️🙏🚩
*ఓం నమః శివాయ*

Ratings & Reviews

3.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

1

2 stars

0

1 stars

0


சமீபத்திய செய்திகள்

2020-07-30 13:01:09
299 views10:01
திற / கருத்து
2020-07-30 13:00:57 Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/BzsiHKut7dEHRFlDOxqg0X

మొదటి నుంచి కావాలంటే Telegram Group జాయిన్ అవ్వండి https://t.me/PeriyaPuranam

*శివ భక్తులు - నాయనార్ల జీవిత చరిత్రలు - పెరియ పురాణం*

*ఓం నమః శివాయ*
*62).సదయ నాయనారు*

*63).ఇసైజ్ఞాన నియారు నాయనారు*

తిరునావలూరులో తిరుమురైపడిలో సదయనార్ అనే ఆదిశైవుడు ఉండేవాడు . అతని పూర్వీకులందరూ మహాశివభక్తులు . ఇసైజ్ఞాననియారు అతని సతీమణి . మహాపతి వ్రత . ఆమెకు గూడ శివుడనిన మహాప్రీతి . వారి పూర్వ జన్మల విశేషం మూలమున దైవ దత్తంగా ఒక పుత్రుడు కలిగాడు . అతనే ప్రసిద్ధి వహించిన సుందర మూర్తి నాయనారు.

అక్కడమన్నరాజు నరసింగ మునైయారు ఈ శిశువును , శిశువు అందాన్ని చూచి ముగ్ధుడై పెంచుకుంటానని తల్లిదండ్రుల నడుగగా - వారు ఏమీ ఆలోచించ కుండ వెంటనే ఆ శిశువును రాజుగారి కిచ్చారు . ఈ ఇవ్వటంలో వారి వైరాగ్యభావము , దేని యందు మమకారము లేకుండుట ప్రస్ఫుటమైంది . వారలు గృహస్థ ధర్మమును చక్కగా నిర్వహించి అంత్యమున శివసాయుజ్యమందారు . నాయనార్లుగా పిలువ బడ్డారు . ప్రపంచానురక్తిలో సంసార బంధము ఒకటి.

అనురక్తి కలిగిన సంసారముం టుంది . భవ బంధాలు ఏర్పడుతాయి . అనుబంధరహితంగ నిర్లిప్తతతో నున్నచో నీవు బంధములనుండి విముక్తులవుతారు . జీవన్ముక్తులవుతారు . క్షణంలోనే బ్రహ్మానంద స్థితిని చేరుకోగలరు . హిందూ ఆర్ష సంప్రదాయము ఇది వక్కాణిస్తుంది . క్షణంలోనే అన్నిభవ బంధాల్నుండి సశరీరంగానే విముక్తిడిగా భాసిస్తారు . ప్రపంచమంతా దివ్యజ్యోతి స్వరూపంగా గమనించగలరు. సృష్టి పరిజ్ఞానము వ్యతిరేక రూప ప్రతిరూపాలు అన్ని సుగమమవుతాయి .
307 views10:00
திற / கருத்து
2020-07-30 12:51:14
182 views09:51
திற / கருத்து
2020-07-30 12:51:00 Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/BzsiHKut7dEHRFlDOxqg0X

మొదటి నుంచి కావాలంటే Telegram Group జాయిన్ అవ్వండి https://t.me/PeriyaPuranam

*శివ భక్తులు - నాయనార్ల జీవిత చరిత్రలు - పెరియ పురాణం*

*ఓం నమః శివాయ*
*60).కోచన్ గాట్ చోళ నాయనారు*

చోళ దేశంలో చంద్ర తీర్థముంది. చంద్రతీర్థములో ఒక చోట దట్టమైన పాద వుంది . ఆదట్టమైన పొద దగ్గర జంబూ వృక్షముంది .ఆజంబూ వృక్షము క్రింద శివలింగ ముంది . ప్రతిదినము ఒక తెల్ల ఏనుగు వచ్చి లింగము ముందు సాష్టాంగపడి అర్చించి వెళ్లేది . ఒక సాలీడు గూడ ఆ శివలింగమును పూజించేది . ప్రతిరోజూ ఆ లింగంపై ఎండు టాకులు పడుతుండుట చూచి ఆ ఆకులు పడకుండ సాలీడు శివలింగంపై తన గూడు ను అల్లింది.

మరుసటి రోజున పూజకు ఏనుగు వచ్చి చూస్తే దానిమీద సాలీడు గూడు చూచిం ది . ఎవరో ఆ లింగంను అపవిత్రము చేశారని భావించి ఆ సాలీడు గూడును తీసివేసి అర్చించి వెళ్లి పోయింది . తర్వాత సాలీడు వచ్చి చూస్తే తన గూడు కన్పించలేదు . తన గూడు పోయినందుకు విచారించి తిరిగి తన గూడును శివునిమీద రక్షణకు అల్లింది . మరుసటి దినమున ఏనుగు తన గూడును పాడుచేయు చుండుట చూచి సాలీడు ఏనుగును కుట్టింది.

ఏనుగు దాని విషంతో అక్కడి కక్కడే మరణించింది . సాలీడు గూడ ఏనుగు తొండం క్రింద పడి మరణించింది . శివానుగ్రహమువలన సాలీడు చోళరాజు సుబాదేవన్ కు కుమారుడుగా జన్మిం చింది . సుబాదేవన్ అతని సతీమణి చిదంబరము వెళ్లి నటరాజస్వామిని తమకు సంతతికై ఒక కుమారునికై అర్థించారు . పరమశివుడు వారిని అనుగ్రహించాడు . అతని సతీ మణి కోమలవతి గర్భం ధరించింది . కుమారుని కనేవేళ అయింది . జ్యోతిష్కులు కొన్ని క్షణాల తర్వాత ఆమె కనినచో త్రిభువనముల నేలు పుత్రుడు జన్మిస్తాడని చెప్పారు.

రాణి గారు - ఆమె పొట్టచుట్టూ గట్టిగా కట్టి తనను ఇంటిలోని చూరుకు తలక్రిందులుగా వ్రేలాడ తీయుడని ప్రార్థించింది . మంచివేళ అవగానే ఆమెను క్రిందికి దించి యధావిధిని పడుకోబెట్టారు . ఆమె పుత్రుని కన్నది . పుత్రుడు కొంచెం ఎక్కువ సేపు తల్లి గర్భంలోనున్నందున అతని కళ్లు ఎల్ల బడ్డా యి . తల్లి తన కుమారుని చూచుకొని కొచెకన్నానో (ఎఱ్ఱకళ్లపుత్రుడు) అని అంటూ ప్రాణం విడిచింది.

యుక్తవయసు రాగానే చోళరాజు ఆ పుత్రునికి పట్టము గట్టి తను అరణ్యాలకు పోయి తీవ్రముగా తపస్సు చేసి శివ సాయుజ్యమందాడు. కోచెన్ గాటు చోళుడు శైవమత వ్యాప్తికి ఇతోదికముగా కృషి చేశాడు . తిరుఅనైకా లో ఇది వరకు జంబూ వృక్షము క్రింద చక్కని దేవాలయమును కట్టి అందులో శివ లింగమును ప్రతిష్ట చేశాడు.

చోళనాడులో ఎన్నో శివాలయాలను మందిరాలను తిల్లెలో 3000 బ్రాహ్మణులకు నిర్మించి యిచ్చాడు . చిదంబరంలో నిత్యార్చనకై కట్టు దిట్టమైన ఏర్పాటు చేశాడు . అంత్యమున శివసాయుజ్యమందినాడు . పోయ్ గయార్ తనరచనలలో కలవాజినారపత్తు లో కోచెన్ గాట్ చోళ నాయనారును పద్యాలలో శ్లాఘించాడు . ఈయన చరితము కొంచెము శ్రీకాళహస్తి చరితమును పోలి వుంటుంది.
164 views09:51
திற / கருத்து
2020-07-30 12:42:55
126 views09:42
திற / கருத்து
2020-07-30 12:40:13 Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/BzsiHKut7dEHRFlDOxqg0X

మొదటి నుంచి కావాలంటే Telegram Group జాయిన్ అవ్వండి https://t.me/PeriyaPuranam

*శివ భక్తులు - నాయనార్ల జీవిత చరిత్రలు - పెరియ పురాణం*

*ఓం నమః శివాయ*

*59).నేశ నాయనారు

నేశ నాయనారు కసిలి నివాసస్తుడు. సాలై కుటుంబములో జన్మించాడు . శివు డన్నా శివభక్తులన్నా ఈయనకు పరమ ఇష్టము . ఎల్లప్పుడూ పరమశివుని చరణాలపైననే నేశనాయనారు దృష్టివుండేది . నాలుక నిరంతరము పంచాక్షరినే ఉచ్ఛరించేది . భక్తుల సేవలలో ఆయన కరచరణాలు నిమగ్నమై యుండేవి . ఈ త్విగుణాలు ఆయనకు శివ సాయుజ్యాన్ని అనుగ్రహించాడు . ఈయన జీవితము దైవనామమహాత్మ్యమును ప్రస్ఫుటము చేస్తుంది.

సిరపుల్లి నాయనారు రాత్రింబగళ్లు నిరంతర పంచాక్షరి జపంచేసేవాడని చూచాము . నిరంతర స్మరణలో నేశనాయనారు గూడ గడిపే వాడు . ఈ పద్ధతి ఇలా వుంటుంది . ప్రొద్దున్న నిదు రనుంచి లేవగానే ఒక అర్థగంట సేపు కూర్చొని పంచాక్షరి మంత్రజపము చేయండి.

ఈ వరవడి ఆగకుండ యుండుటకు పనిచేస్తున్నప్పుడు గూడ ప్రతిగంటకు ఒక్క తూరి ఆగి జపముకొన సాగించండి మంత్రోచ్ఛారణ చేయునంత సేపు భగవంతుని దర్శిస్తున్నట్లు భావించండి . ఈ విధమైన సాధన మీకు సహజమైతే - మీరు పనిచేస్తున్నా , కూర్చున్నా , నించున్నా , నిద్రిస్తున్నా - మీ మనస్సు మంత్ర జపము చేస్తూనే వుంటుంది . ఈ జపయోగంతోపాటు నాయనారు యోగమమైక్యత గూడ సాధన చేశాడు.
దైవం గూర్చి తపించాడు . దైవం కోసం పనిచేశాడు . దైవం ఎడల నిరతిశయభక్తిని చూపాడు . దైవాన్ని అపరిమితంగా ప్రేమించాడు .
122 views09:40
திற / கருத்து
2020-07-30 12:38:19
109 views09:38
திற / கருத்து