Get Mystery Box with random crypto!

Follow this link to join my WhatsApp group: https://chat.whats | 🔱 🕉️🙏🚩 *శివ భక్తులు - నాయనార్ల జీవిత చరిత్రలు - పెరియ పురాణం* 🔱 🕉️🙏🚩

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/BzsiHKut7dEHRFlDOxqg0X

మొదటి నుంచి కావాలంటే Telegram Group జాయిన్ అవ్వండి https://t.me/PeriyaPuranam

*శివ భక్తులు - నాయనార్ల జీవిత చరిత్రలు - పెరియ పురాణం*

*ఓం నమః శివాయ*

*59).నేశ నాయనారు

నేశ నాయనారు కసిలి నివాసస్తుడు. సాలై కుటుంబములో జన్మించాడు . శివు డన్నా శివభక్తులన్నా ఈయనకు పరమ ఇష్టము . ఎల్లప్పుడూ పరమశివుని చరణాలపైననే నేశనాయనారు దృష్టివుండేది . నాలుక నిరంతరము పంచాక్షరినే ఉచ్ఛరించేది . భక్తుల సేవలలో ఆయన కరచరణాలు నిమగ్నమై యుండేవి . ఈ త్విగుణాలు ఆయనకు శివ సాయుజ్యాన్ని అనుగ్రహించాడు . ఈయన జీవితము దైవనామమహాత్మ్యమును ప్రస్ఫుటము చేస్తుంది.

సిరపుల్లి నాయనారు రాత్రింబగళ్లు నిరంతర పంచాక్షరి జపంచేసేవాడని చూచాము . నిరంతర స్మరణలో నేశనాయనారు గూడ గడిపే వాడు . ఈ పద్ధతి ఇలా వుంటుంది . ప్రొద్దున్న నిదు రనుంచి లేవగానే ఒక అర్థగంట సేపు కూర్చొని పంచాక్షరి మంత్రజపము చేయండి.

ఈ వరవడి ఆగకుండ యుండుటకు పనిచేస్తున్నప్పుడు గూడ ప్రతిగంటకు ఒక్క తూరి ఆగి జపముకొన సాగించండి మంత్రోచ్ఛారణ చేయునంత సేపు భగవంతుని దర్శిస్తున్నట్లు భావించండి . ఈ విధమైన సాధన మీకు సహజమైతే - మీరు పనిచేస్తున్నా , కూర్చున్నా , నించున్నా , నిద్రిస్తున్నా - మీ మనస్సు మంత్ర జపము చేస్తూనే వుంటుంది . ఈ జపయోగంతోపాటు నాయనారు యోగమమైక్యత గూడ సాధన చేశాడు.
దైవం గూర్చి తపించాడు . దైవం కోసం పనిచేశాడు . దైవం ఎడల నిరతిశయభక్తిని చూపాడు . దైవాన్ని అపరిమితంగా ప్రేమించాడు .